వరంగల్ కమిషనరేట్ పరిధిలో అనధికారికంగా ఫ్లెక్సీలు, గోడ పత్రికలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ పమేలా సత్పతి హెచ్చరించారు. ప్రధాన కూడళ్లలోని గోడలపై ప్రకటనలకు సంబంధించిన పత్రికలను అతికించరాదని స్పష్టం చేశారు.
ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయాలంటే నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై మున్సిపల్ నూతన చట్టం 161(3 ) ప్రకారం కఠిన చర్యలు తప్పవని అన్నారు.