నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు మణికంఠుని దర్శనం కోసం శబరి యాత్రకు బయలుదేరారు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శబరిమల యాత్రకు బయలుదేరే అయ్యప్ప స్వాములు ముందుగా అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుముడిని తలపై పెట్టి యాత్రను ప్రారంభించారు. ఇరుముడిని తలపై పెట్టుకున్న స్వాములు స్వామి శరణాలు చేస్తూ... ముందుకుసాగారు. అయ్యప్ప స్వాములతో వరంగల్ రైల్వే ప్రాంగణం కిటకిటలాడింది.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఖమ్మం గుమ్మంలో సమస్యల విలయతాండవం