అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులను వినయభాస్కర్ పంపిణీ చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారని చెప్పారు. పేద ప్రజలకు మేలు చేసేలా సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...