ETV Bharat / state

అన్ని మతాలకు సమ ప్రాధాన్యం: వర్ధన్నపేట ఎమ్మెల్యే - ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

రాష్ట్రంలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్​ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ అన్నారు. ఈ మేరకు క్రిస్మస్​ సందర్భంగా వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తి మండల కేంద్రంలోని చర్చిలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.

vardhannapet mla aruri rameash distributed clothes to christians
అన్ని మతాలకు సమ ప్రాధాన్యం: వర్ధన్నపేట ఎమ్మెల్యే
author img

By

Published : Dec 19, 2020, 2:23 PM IST

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని మతాల పర్వదినాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులకు ఎమ్మెల్యే.. బట్టల పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని మతాలకు కేసీఆర్​ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఏ తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

పేద క్రైస్తవుల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని రమేష్​ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేసరి చెరువు శిఖం.. అక్రమార్కుల వశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.