వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం పెగడపల్లిలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళలను ఉత్సాహపరుస్తూ.. సందడి చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని సూచించారు.