ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సూపర్ స్పెడర్స్ (super spreaders) కు టీకాలిచ్చే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (minister errabelli dayakar rao) ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన కేంద్రాల్లో టీకాలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మొత్తం 90,500 మందిని గుర్తించగా రోజుకు 6వేల మందికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్, మేయర్ గుండు సుధారాణి, ఇతర వైద్యారోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Lock down: ప్రజల సహకారంతో పటిష్ఠంగా లాక్డౌన్