వరంగల్ పట్టణంలో ఉగాది పండుగ సందడి నెలకొంది. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని హన్మకొండ చౌరస్తాలో పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో ఆ ప్రాంతం రద్దీగా మారింది. వేపపూత, చింతపండు, మామిడి కాయలు, మామిడి ఆకులు, పచ్చడి కుండలు, పూలు, పండ్లు తదితర సామాగ్రిని కొనుగోలు చేశారు. పండుగ సాకుతో.. ధరలు భారీగా పెంచారని కొనుగోలుదారులు వాపోయారు.
ఇవీ చూడండి: అందరికి విద్యనందించడమే నా లక్ష్యం: వెన్నెల