వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. 58 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హన్మకొండ బస్టాండ్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేందుకు బస్సులు రాగా.. ప్రయాణికులు అందులో ఎక్కి వెళ్లారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఒక సీటులో ఇద్దరు మాత్రమే కూర్చోని ప్రయాణిస్తున్నారు.
నేటి నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతించడం వల్ల వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు, జిల్లాలకు బస్సులు వెళ్లనున్నాయి. దాదాపు 907 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా బస్సులో ప్రతి భాగాన్ని శానిటైజ్‌తో శుభ్రం చేస్తున్నారు. ఇప్పడిప్పుడే ప్రయాణికులు మెల్లగా బస్టాండ్‌కు చేరుకుంటున్నారు.
ఇదీ చూడండి: ప్రియాంక ఆఫర్‌కు సై అన్న యోగి సర్కార్!