వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హజరై... పార్టీ జెండా ఎగురవేశారు.
అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా... వాటిని విజయవంతంగా తెరాస ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమం అనంతరం 64, 46 డివిజన్లలో బరిలో ఉన్న తెరాస అభ్యర్థులకు మద్దతుగా కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెరాస-భాజపాలతో నగరానికి ఒరిగిందేం లేదు : రేవంత్ రెడ్డి