వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో చోరీ జరిగింది. కూరగాయలు మార్కెట్లో ఓ ఇంటి తాళం పగులగొట్టి 30 తులాల బంగారం, రూ.40వేల నగదు దోచుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. కుమారుడి పెళ్లికోసం కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి చిల్పూర్ దేవాలయానికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోంచి బయటికి రావడం గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఇంటి యజమానికి సమాచారం అందించారు.
కల్యాణమండపం నుంచి హుటాహుటిన ఇంటికి చేరుకోగా అప్పటికే ఇళ్లు గుల్లచేశారని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బావా అక్కతో కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు