వరంగల్ నగరంలోని కాశిబుగ్గ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో దుండగులు ఆలయ ప్రధాన గేటుకు ఉన్న తాళాన్ని తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతకు ముందు కూడా దొంగతనం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
రాత్రి వేళలో పోలీసుల పెట్రోలింగ్ లేని కారణంగానే దొంగతనాలు పెరుగుతున్నాయని అన్నారు. రూ.10 వేల నగదుతో పాటు స్వామివారి వెండి కవచం, కిరీటం అపహరణకు గురైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథచార్యులు తెలిపారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఏడీజీ స్వాతి లక్రా