ETV Bharat / state

ఆలోచన అదిరింది.. వేసవి తాపం తీరింది - summer protection in zoo for animals

భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండవేడిమి తాళలేక అడుగు బైట పెట్టాలంటేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే జూలో ఉండే మూగ జీవాల అవస్థ వర్ణణాతీతం. సెగలు కక్కుతున్న సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోలేక  అల్లాడిపోతున్నాయి. మూగ జీవులకు ఎండనుంచి రక్షణ కల్పించేందుకు వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని కాకతీయ జూ పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆలోచన అదిరింది.. వేసవి తాపం తీరింది
author img

By

Published : May 9, 2019, 8:58 PM IST

ఆలోచన అదిరింది.. వేసవి తాపం తీరింది

గరిష్ఠ స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. క్షణం పాటు ఎండలో ఉంటే ఒంట్లో నీరు ఆవిరైపోతుందేమో అన్నంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మన పరిస్థితే ఇలా ఉంటే మరి జూలో ఉండే మూగ జీవాల పరిస్థితి మరీ వర్ణణాతీతం.

చుట్టూ ఉండే ఇనుప పంజరాలు ఎండ తీవ్రతకు నిప్పుకణంలా కాలిపోతుంటే.. కుంటల్లో నీరు మరిగిపోతున్నట్లు పొగలు కక్కుతుంటే క్షణం నిలవలేక మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించేందుకు హన్మకొండలోని కాకతీయ జంతు ప్రదర్శన శాల అధికారులు మూగ జీవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక శ్రద్ధ

జంతువుల కోసం నీటి తిపర్లు, చలువ పందిర్లు వేశారు. కూలర్లు ఏర్పాటు చేసి సేదతీర్చుతున్నారు. పక్షులుండే పంజరాల చుట్టూ పరదాలు కట్టారు. జంతువులుండే ప్రాంతాల్లో వేడిని నియంత్రించేందుకు తుంగ గడ్డి పరిచి తరచూ దానిపై నీరు చల్లుతూ ఉపశమనం కల్పిస్తున్నారు.

పశువైద్యుల సూచనలు పాటిస్తూ మూగజీవాలకు ఎండనుంచి కొంగు కాస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం కొంతమంది సిబ్బందిని కేటాయించి ఎల్లవేళలా కంటిరెప్పలా కాపాడుకుంటున్నారు.

ఇవీ చూడండి: భానుడి భగభగలు.. ఆరోగ్య సూత్రాలు

For All Latest Updates

TAGGED:

zoo park
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.