ETV Bharat / state

కాజీపేట రైల్వే లోకోషెడ్​ను సందర్శించిన విద్యార్థులు

విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తి కలిగించేందుకు వరంగల్ నిట్ నడుం బిగించింది. రాష్ట్రీయ ఆవిష్కార్​ అభియాన్​ కార్యక్రమంలో భాగంగా రైల్వే లోకో షెడ్​కి విద్యార్థులను తీసుకెళ్లారు.

కాజీపేట రైల్వే లోకోషెడ్​ను సందర్శించిన విద్యార్థులు
author img

By

Published : May 11, 2019, 7:17 PM IST

కాజీపేట రైల్వే లోకోషెడ్​ను సందర్శించిన విద్యార్థులు

వరంగల్ నిట్​లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రతిభ కనపరిచిన 60 మంది బాలబాలికలను ఎంపిక చేసి నెల రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులను కాజీపేట్ రైల్వే లోకో షెడ్​కి తీసుకెళ్లారు. రైల్వే అధికారులు రైలింజన్​కు సంబంధించిన సాంకేతిక అంశాలు, రిపేర్లు వంటి విషయాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చిన్నారులు తమకు తెలియని కొత్త విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల 30 వరకు జరిగే ఈ తరగతుల్లో వివిధ విభాగాల్లోని ప్రయోగశాలలో పరిశోధనలు ఎలా జరుగుతున్నాయో ప్రత్యక్షంగా వీక్షించి వాటి గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు.

ఇదీ చూడండి : ఉద్యోగానికి ఎసరు తెచ్చిన ఐపీఎల్​ పాస్​

Intro:TG_WGL_13_11_SUMMER_CAMP_STUDENTS_VISITED_RAILWAY_LOCO_SHED_AB_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులు కాజీపేట్ లోని రైల్వే డిజిల్ లోకో షెడ్ ని సందర్శించారు. విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తిని కల్పించేందుకు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారాప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల నుంచి వివిధ అంశాల్లో మెరుగైన ప్రతిభ కనపరిచిన 60 మంది బాల బాలికలను ఎంపిక చేసి నిట్ ప్రాంగణంలో నెల రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను వారిని ఈరోజు రైల్వే లోకో షెడ్ కి తీసుకువచ్చారు. ఇక్కడి అధికారులు రైలింజన్ కు సంబంధించిన సాంకేతిక అంశాలు రిపేర్లు వంటి విషయాలను విద్యార్థులకు క్షుణ్నంగా వివరించారు. విద్యార్థులు కూడా తమకు తెలియని కొత్త విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ వరకు జరిగే ఈ తరగతులలో వివిధ విభాగాల్లోని ప్రయోగశాలలో పరిశోధనలు ఎలా జరుగుతున్నాయో విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించి వాటి గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు. .
bytes...

సంజనా, శిక్షణ శిబిరం విద్యార్థిని.
హర్షిత, శిక్షణ శిబిరం విద్యార్థిని.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.