వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ రాష్ట్ర ఐకాస పిలుపు మేరకు హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. మూడు నెలల నుంచి జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం