ETV Bharat / state

గ్రామసింహాల స్వైరవిహారం.. పదిమందికిపైగా గాయాలు - warangal urban dist updates

వరంగల్ అర్బన్ జిల్లాలో శునకాలు రెచ్చిపోయాయి. ఐనవోలు మండలం నందనం గ్రామంలో దాడి చేసి పదిమందికి పైగా గాయపర్చాయి. కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు సహా ఓ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి.

street dogs attack people in warangal urban dist
గ్రామసింహాల స్వైరవీహారం.. పదిమందికిపైగా గాయాలు
author img

By

Published : Oct 10, 2020, 4:08 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో శునకాలు స్వైరవీహారం చేశాయి. గ్రామంలోని వీధుల్లో పిల్లలతో సహా పెద్దవారిపై దాడి చేసి పదిమందికి పైగా గాయపర్చాయి. వారిలో ఓ ఐదేళ్ల బాలునితో పాటు వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు.

ఇదీ చూడండి; అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.