శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కొలువై ఉన్న రుక్మిణి సమేత శ్రీ కృష్ణుడికి అభిషేకాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి. స్వామివారికి వెన్న నివేదన చేసి మూల మంత్ర సహిత రుద్ర హోమము, నిత్య సహస్ర మోదక హోమము, శ్రీ కృష్ణ మూల మంత్రములచే హోమాలు నిర్వహించారు.
భగవద్గీత పారాయణం, నగర సంకీర్తన, అర్చన, హారతి, తీర్థప్రసాద వితరణ తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయంలో గణపతి దీక్ష తీసుకుంటున్న భక్తులకు మాలధారణ చేయించి వారితో ప్రత్యేక పూజలు చేయించారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర ప్రజలందరికీ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు'