వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు.. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల నమూనాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఓ విద్యార్థి ప్రదర్శించిన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: గూగుల్ సాయం కావాలా? 'మీనా'తో మాట్లాడాల్సిందే!