వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్‌కు చెందిన నాయిని ఐలయ్య, వెంకటలక్ష్మి దంపతులు. ఈ రోజు బ్యాంకుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. రోడ్డు దాటుతున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సిసి కెమెరాల సహాయంతో వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ