వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Enumamula Agricultural Market) బుధవారం కొత్తపత్తి రాకతో కళకళలాడింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామ రైతు కొమురయ్య తెచ్చిన 14 బస్తాల కొత్త పత్తికి రికార్డుస్థాయి(Cotton record prices)లో ధర పలికింది. క్వింటాకు (Quintal new cotton) రూ.7,610 ధర పలకడంతో రైతు కొమురయ్య సంతోషంలో మునిగి తేలిపోయారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో కలిసి, మార్కెట్ ఛైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పాత పత్తి(Cotton record prices)కి రూ.8,210 ధర రికార్డు కాగా (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి), కొత్త పత్తికి రూ.7,610 అని మార్కెట్ వర్గాలంటున్నాయి. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.5,825 కాగా... అంతకంటే రూ.1,785 ధర అధికంగా పలకడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తాము పండించిన పంటకు మంచి ధర(Cotton record prices) పలుకుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాము పడిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్లోనూ పత్తికి ఇలాగే మంచి ధర పలికితే.. ఈ తెల్ల బంగారం సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో ధర (Cotton record prices) పెరగడం బాధాకరమని రైతులు వాపోయారు.
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగడం, బేళ్ల ధరలతో పాటు పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడటం వల్ల పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడమూ ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు.
ఇదీ చూడండి: COTTON: ఎనుమాముల మార్కెట్లో రికార్డు ధర పలుకుతోన్న పత్తి ధర
KHARIFF SEASON: జోరందుకున్న ఖరీఫ్ సాగు... పెరిగిన పత్తి విస్తీర్ణం