ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేస్తే స్పందిస్తామని పోలీసులు మరోసారి రుజువు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాశిబుగ్గ లోనిలోతుకుంటకు చెందిన ఎండీ ఆషా బేగం నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రాగా... ముందుగా 108, 104 నంబర్లకు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. వారు స్పందించక పోవడం వల్ల 100 నంబర్‌కి ఫోన్ చేశారు.
వివరాలు తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఇంతేజార్ గంజ్ పోలీసులను అప్రమత్తం చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించి... ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసుల సేవలకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీచూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500