లాక్డౌన్లో తినడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాథలు, యాచకులకు పండ్లు, ఆహార పొట్లాలను పంపిణీ చేస్తూ వరంగల్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. నగరంలో ఆహారానికి ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ట్రాఫిక్ సీఐ నరేశ్ పండ్లను అందజేశారు.
మిల్స్ కాలనీ సీఐ రవి కిరణ్ వరంగల్ బస్టాండులోని ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేశారు. పోలీసుల మానవత్వం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు