ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం స్ఫూర్తితో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు, సామాజిక సేవకురాలు మహ్మద్ యాకూబీ 'మన పట్టణం-మన బాధ్యత' కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ నగర్లోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలను, చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు.
రోడ్డు వెంబడి ఉన్న పిచ్చి చెట్లను తొలగించారు. ఇలా పది రోజుల పాటు పది మందితో కలిసి వివిధ కాలనీల్లో... స్వచ్ఛత కార్యక్రమం చేస్తామని సామాజిక సేవకురాలు మహ్మద్ యాకూబీ చెప్పారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చుట్టు పక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.
ఇవీ చూడండి: ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య