ETV Bharat / state

Telangana private schools fees: 'ప్రైవేటు' దోపిడీ.. పాత ఫీజులు కడితేనే కొత్త క్లాసులు.!

కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు, ఉద్యోగులు(Telangana private schools fees).. ప్రైవేటు పాఠశాలల ఆగడాలతో ఆందోళన చెందుతున్నారు. లాక్​డౌన్​తో పాఠశాలలు మూతపడినా.. ప్రస్తుతం ఆన్​లైన్​ క్లాసుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్​ చేసింది. అయినప్పటికీ వారి తీరు మారలేదు.. సరికదా.. పిల్లలకు టీసీ ఇవ్వాలని సంబంధిత తల్లిదండ్రులు అడిగితే.. గతేడాది ఫీజులు కడితేనే ఇస్తామని మెలికలు పెడుతున్నారు. దీంతో విసుగు చెందిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్​ ఎదుట బాధితుల ఆవేదన ఇది.

author img

By

Published : Nov 25, 2021, 2:20 PM IST

ekashila school hanmakonda
ఏకశిల స్కూల్​ హనుమకొండ

Telangana private schools fees: అధిక ఫీజులు వసూల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని హనుమకొండ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు.. బుధవారం ఆందోళనకు దిగారు. ఆన్​లైన్ క్లాసుల పేరుతో లాక్​డౌన్​లో పెండింగ్​లో ఉన్న ఫీజులు చెల్లించాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పాత ఫీజులు కడితేనే కొత్త ఆన్​లైన్​ తరగతులు పెడతామని వేధిస్తున్నారని వాపోయారు. నియంత్రణ కరవై అందినకాడికి డబ్బులు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యాల జులం ఎక్కువైందని.. వాటిని నియంత్రించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయినా చెల్లించాలి

ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని ఏకశిల ఈ టెక్నో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం(fees harassment in private schools).. ఆన్​లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు ఇవ్వాలని విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఆన్​లైన్ క్లాసులు విన్నా, వినకపోయినా డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదని కరోనా దృష్ట్యా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమను అధిక ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఫీజుల భారం తమ వల్ల కాదని.. టీసీ ఇవ్వమన్నా.. డబ్బులు చెల్లించే వరకు టీసీ ఇవ్వడం కుదరదన్నారని తెలిపారు.

కరోనా లాక్​డౌన్​ కారణంగా రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్​ చేసింది. కానీ ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం గతేడాది ఫీజు కూడా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. మా వల్ల కాదు టీసీ ఇవ్వమని అడిగితే.. పాత ఫీజులు కడితేనే టీసీ ఇస్తామని అంటున్నారు. కొవిడ్ కారణంగా ఉపాధి లేక, వ్యాపారాలు సాగక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ వీళ్లు మాత్రం మమ్మల్ని ఆన్​లైన్​ క్లాసుల పేరుతో అధిక ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. ఒక్క స్కూల్​ బస్సు ఫీజు మినహా.. మిగిలిన అన్ని రుసుములు వసూలు చేయాలని చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. -విద్యార్థుల తల్లిదండ్రులు

ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల దోపిడిని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు(protest at ekashila e techno school) డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల దోపిడీపై జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్​ సంక్షోభం, ప్రైవేటు పాఠశాలల దోపిడీతో ఆర్థికంగా నష్టపోయిన తల్లిదండ్రులు.. తమ పిల్లలను సర్కారు, గురుకుల పాఠశాలల్లో చదివించడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు(telangana private schools) దీటుగా విద్యాబోధన, పరిశుభ్రతలో కూడా నెంబర్​ 1 గా ప్రభుత్వ బడులు ఉండటమే ఇందుకు కారణం. కారణమేదైనా ప్రైవేటు స్కూళ్ల ఫీజుల మెలికలతో విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్న మాట మాత్రం వాస్తవమని.. ఇది తమ ఒక్కరి ఆవేదన కాదని.. ఎంతో మంది ఇలా అధిక ఫీజుల భారాన్ని మోయలేక సతమతమవుతున్నారని బాధితులు వాపోతున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ఇదీ చదవండి: రూటు మార్చిన చదువులు.. ప్రైవేటు నుంచి 'ప్రభుత్వ బడులకు'!

central minister kishan reddy: 'భారత్ టీకాల కోసం ఇతర దేశాలు ఎదురు చూస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.