ETV Bharat / state

'పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలందిస్తున్నాం' - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్​ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

parakala-mla-distributed-kalyana-laxmi-cheques-in-warangal-district
'పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలందిస్తున్నాం'
author img

By

Published : Jan 10, 2020, 5:32 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. దామెర మండలంలోని పలుగ్రామాలకు చెందిన 98 మందికి రూ.95 లక్షల విలువగల చెక్కులు అందజేశారు.

'పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలందిస్తున్నాం'

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్​దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కొనియాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని పేర్కొన్నారు.

TG_WGL_44_10_KALYANA_LAXMI_AV_TS10074 Cantributer kranthi parakala *కళ్యాణలక్ష్మి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా...* *ఆత్మకూరు,దామెర,పరకాల,నడికూడ మండలాల లబ్దిదారులకు చెక్కులు అందుచేత..* *98 మంది లబ్ధిదారులకు గాను సుమారు రూ.95.00 లక్షల విలువగల చెక్కుల పంపిణి.* *దేశం గర్వించదగిన పథకం కళ్యాణలక్ష్మి పథకం..* *అన్ని వర్గాల ప్రజలకు అండగా కేసీఆర్* హన్మకొండలోని ఎమ్మెల్యే గారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల,నడికూడ,ఆత్మకూరు, దామెర మండలాలలోని పలుగ్రామాలకు చెందిన 98 మంది లబ్ధిదారులకు గారు సుమారు రూ.95లక్షల విలువగల చెక్కులు అందచేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలవాలనే మంచి ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన పథకం కళ్యాణలక్ష్మి అన్నారు.మొదటగా రూ.51000/- లతో ప్రారంభించి ఎవరు అడగకుండానే రూ.100116/- ఇస్తున్న ఘనత కేసీఆర్ గారిది. దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిదన్నారు.పబ్బం గడపడానికె ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ మీద దుష్ప్రచారాలు చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ గారిని ఏమిచేయలేవన్నారు. ఒక్క కళ్యాణలక్ష్మి పథకమే కాకండ పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత సిఎం గారిదన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో అర్హతగల ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందచేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధికి దారులు పట్టాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపిపిలు,జెడ్పిటిసిలు,అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.