ఇదీ చూడండి : మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం
మన రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు : మంత్రి ఈటల - వరంగల్ జిల్లా వార్తలు
రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరుగుతున్న దృష్ట్యా కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 25 దేశాలకు ఈ వైరస్ విస్తరించినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఈ వైరస్ ప్రభావం లేదని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షల కోసం చేరిన వరంగల్ వాసులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే 50 మందికి పైగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. కోటి మందికి పైగా భక్తులు వచ్చే మేడారంలో కట్టుదిట్టమైన వైద్యసేవలు అందిస్తున్నామంటున్న మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.
మన రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు : మంత్రి ఈటల
ఇదీ చూడండి : మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం