వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం దర్గా ప్రాంతంలో వర్షం కారణంగా నిట్ ప్రహరీ గోడ కూలిపోయింది. గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో ప్రహరీ నానడం వల్ల సుమారు 50 మీటర్ల మేర నేలమట్టమయింది.
ఈ ఘటనలో ప్రహరీ గోడ పక్కన పార్కింగ్ చేసిన పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమవడంతో పాటు ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. రహదారి పక్కనే ఉన్న గోడ కూలడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ