మాస్క్ లేకుండా రోడ్డెక్కిన వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సుమారు 500 పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇవీచూడండి: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా భయం.. జంకుతున్న అధికారులు