వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి... ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: శరన్నవ రాత్రి శోభను సంతరించుకున్న భద్రకాళి ఆలయం