ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడికి మనుషులే కాదు... జంతువులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఈ తరుణంలో వరంగల్లో కోతులు వేడికి తట్టుకోలేక నీళ్లలో జలకాలాడాయి.
అసలే కోతులు అంటే వాటి గోల చెప్పనవసరం లేదు. నీళ్లలో మునిగి తేలుతూ ఎగురి దూకుతూ సందడి చేశాయి. అక్కడ ఉన్న నీటి కొలనులో చల్లదనానికి చాలా సేపు అందులోనే ఆడుతూ ఎండ వేడి నుంచి ఉపశమనం చెందాయి.
ఇదీ చూడండి : 'పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు పెట్టుకోవడం మేలు'