వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరంలో ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్థులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలను సామజిక దూరాన్ని పాటించాలని కోరారు.
లాక్డౌన్ కారణంగా తన నియోజకవర్గంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దని… అందుకే గత మూడు వారాలుగా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణ ప్రజలకంటే పల్లె ప్రజలే లాక్డౌన్ను ఎక్కువగా పాటిస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు