వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సీజన్ ఆరంభంలో మిర్చి రికార్డు ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తేజ రకం మిర్చి క్వింటా ధర ఈరోజు ఏకంగా 20 వేల రూపాయలకు చేరుకుంది. US341 రకం మిర్చి రూ. 17,800 గరిష్టంగా పలికింది.
రైతులు సాగు చేసిన పంటలకు మంచి ధరలు దక్కుతున్నాయి. సీజన్ చివరి నాటికి ఇదే ధరలు పలికితే రైతులకు లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరల పెరుగుదలకు గల కారణాలను కార్యదర్శిని అడుగగా దాటవేశారు.
ఇదీ చూడండి : తప్పుడు పత్రాలతో రుణం... ఎస్బీఐ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు