నాలలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, వరంగల్ మేయర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.
![minister satyavathi rathod visit warangal Sink areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-15-15-minister-visit-mumpuprantalu-av-ts10076_15102020112257_1510f_00635_701.jpg)
![minister satyavathi rathod visit warangal Sink areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-15-10-minister-sathyavati-visit-mumpu-naalalu-ab-ts10077_15102020104218_1510f_00514_516.jpg)
![minister satyavathi rathod visit warangal Sink areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-15-10-minister-sathyavati-visit-mumpu-naalalu-ab-ts10077_15102020104223_1510f_00514_338.jpg)
![minister satyavathi rathod visit warangal Sink areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-15-10-minister-sathyavati-visit-mumpu-naalalu-ab-ts10077_15102020104223_1510f_00514_1018.jpg)
అమరావతి నగర్, సమ్మయ్య నగర్, వంద ఫీట్ల రోడ్డులో పొంగి ప్రవహిస్తున్న నాళాలను పరిశీలించారు. ఈసందర్భంగా స్థానికులను, అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నాలలపై అక్రమ నిర్మాణాలను నిష్పక్షపాతంగా తొలిగించాలని సూచించారు. భవిష్యత్ లో నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని వెెల్లడించారు. వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్ రావు