ETV Bharat / state

'అభివృద్ధిని వీడ‌కుండా బ‌డ్జెట్​ని రూపొందించారు'

మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు సీఎం కేసీఆర్​కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. వరంగల్ కార్పొరేషన్‌కు 250 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్దిని ఆకాంక్షించే విధంగా ఉందని అన్నారు.

minister errabelli said Budget designed to keep development in telangana
'అభివృద్ధిని వీడ‌కుండా బ‌డ్జెట్​ని రూపొందించారు'
author img

By

Published : Mar 18, 2021, 5:15 PM IST

సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ది సమాహారంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని పంచాయితీరాజ్‌ గ్రామీణావృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కార్పొరేషన్‌కు 250 కోట్ల నిధులు కేటాయించడం పట్ల ఆయన సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ తర్వాత రెండో పెద్దదైన వరంగల్ అభివృద్దికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. తెలంగాణ ప్రజ‌ల ఆకాంక్షల‌కు అద్దం ప‌డుతూ, స‌క‌ల జ‌నుల‌ సంక్షేమం, అభివృద్ధిని వీడ‌కుండా బ‌డ్జెట్​ని రూపొందించారని మంత్రి కొనియాడారు.

సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని వివరించారు. బీటీ రోడ్ల సౌక‌ర్యం లేని ఎస్టీ తండాలకు 165 కోట్లు, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల కోసం.. 11 వేల కోట్లు, చేనేత కార్మికుల కోసం 338 కోట్లు, క‌ళ్యాణ లక్ష్మీకి అద‌నంగా 500 కోట్లు ప్రతిపాదించ‌డం ప‌ట్ల ఎర్రబెల్లి హ‌ర్షం వ్యక్తం చేశారు.

మ‌రోవైపు తాను నిర్వహిస్తున్న, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిష‌న్ భ‌గీర‌థ‌కు నిధులు కేటాయించినందుకు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు సీఎం కేసీఆర్​కు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

ఇదీ చూడండి : 'ఓయూ, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలేదు: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.