తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 15వ డివిజన్ పరిధిలోని గొర్రెకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ.. తెరాస అభ్యర్థి ఆకులపల్లి మనోహర్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
- ఇదీ చదవండి : ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు మృతి