నిత్యం తనవెంటే రక్షణగా ఉంటూ.. పహారా కాసే రక్షక భటుల ఆయుధాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయుధ పూజ చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ ఆయుధ పూజలో మంత్రి ఎర్రబెల్లి దంపతులతో పాటు వారి తనయుడు ప్రేమ్ చందర్ రావు దంపతులు, మనుమలు, మనుమరాండ్లు, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.. కిటకిటలాడిన ఆలయాలు