వినాయక చవితిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన స్వర్ణకారుడు మట్టెవాడ అజయ్ కుమార్ సూది బెజ్జంలో సూక్ష్మ గణపతిని తీర్చిదిద్దాడు. 42 గంటల్లో సూది బెజ్జంలో వినాయకుడితో పాటు చిట్టెలుకను తయారు చేసి ఔరా అనిపించాడు.
మొదటి నుంచి గొప్ప కళాఖండాలు తయారు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన అజయ్ కుమార్... వినాయక చవితి వేళ బొజ్జ గణపయ్యను తయారు చేసి అందరి మన్ననలు పొందారు. గతంలో సత్యాగ్రహ సూక్ష్మ కళలను తయారుచేసిన అజయ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఇదీ చూడండి: Ganesh Chaturthi: గణేశునిలోని ప్రత్యేకమైన గుణాలేంటో తెలుసా?