పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని రెండో రోజు వరంగల్ నగరంలో హెరిటేజ్ వాక్ని నిర్వహించారు. ఫిట్ ఇండియా పేరుతో మేయర్ గుండా ప్రకాశ్ జెండా ఊపి వాక్ని ప్రారంభించారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ తెలిపారు.
ఉదయం 6 గంటలకు హెరిటేజ్ వాక్ జరగాల్సి ఉండగా అధికారుల సమన్వయ లోపంతో ఆలస్యంగా ప్రారంభమైంది. రాతికోట నుంచి మొదలైన ఈ నడక ప్రదర్శన ఏకశిలా పార్కు వరకు సాగింది.
ఇదీ చదవండి: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో జోరుగా సాగుతోన్న అక్రమ ఇసుక రవాణా