వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్, చౌరస్తా ప్రాంతాల్లో యాచిస్తూ... ఉండే వారికి లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి కూడాదొరకట్లేదు. వారి అవస్థలను గుర్తించిన పలువురు పెద్దలు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 60 మంది యాచకులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
లాక్డౌన్ పూర్తి అయ్యే వరకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని అన్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గాను రైల్వే స్టేషన్కి వచ్చి రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు కూడా వీరు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం