ETV Bharat / state

'ఏడేళ్లలో ఇచ్చినా హామీలను తెరాస మరిచిపోయింది'

రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ఇచ్చినా హామీలను మర్చిపోయిందని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

jagtial congress president janga ragahvareddy election campaign
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 25, 2021, 4:13 PM IST

మున్సిపల్​ ఎన్నికలు రాగానే హడావుడిగా శంకుస్థాపనలు చేయడం కాదు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు. ఏడేళ్లలో తెరాస ఇచ్చినా ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

పలు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాసలు రెండూ ఒకటేనని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నాయకులను కోనుగోలు చేసే పనిలో ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేటీఆర్ హడావుడిగా శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ప్రజల తమనే ఆశీర్వదించి గెలిపిస్తారని జంగా రాఘవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: గ్రేటర్​ వరంగల్‌ బరిలో రౌడీషీటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.