ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దంటూ... ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ ఏవీని ప్రదర్శించే ఎల్ఈడీ వాహనాన్ని హన్మకొండలో ప్రారంభించారు.
ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వాడి... పర్యావరణాన్ని కాపాడాలని కేటీఆర్ సూచించారు. ప్రజలను చైతన్య పరిచేలా డాక్యుమెంటరీని రూపొందించినందుకు శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు.
ఇదీ చూడండి: దిగొస్తున్న ఉల్లి ధర... ఆంధ్ర, తెలంగాణకు కొత్త సరుకు