ETV Bharat / state

గీత కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - corona effect

లాక్​డౌన్​ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులకు వరంగల్​ జిల్లా గౌడ సంఘం అండగా నిలిచింది. ముగ్గరు ఎమ్మెల్యేల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.

groceries distributed by 3 mla in hanmakonda
గీత కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 16, 2020, 2:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్​ హాజరై నిరుపేద గీత కార్మికుల కుటుంబాలకు సరుకులు అందజేశారు.

లాక్​డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులను దృష్టిలో పెట్టుకొని గౌడ సంఘం సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యేలు కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.