వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. హన్మకొండలోని జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో జరిగిన వేడుకల్లో... విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు కలెక్టర్ హరిత, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్, వరంగల్ గ్రామీణ పోలీసులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపనికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ అన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్