దైవాన్ని ప్రార్ధించడం ద్వారా ఎలాంటి సమస్యకైనా సమాధానం దొరుకుతుందని ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ లోని ఫాతిమా కెథడ్రెల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బిషప్ ఉడుముల బాలతో కలిసి కేక్ కట్ చేశారు. క్రైస్తవులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా మహ్మమారి విముక్తి కోసం ప్రతీ ఒక్కరూ దైవాన్ని ప్రార్ధించాలని కోరారు. బైబిల్ ఒక పవిత్ర గ్రంథమని...ప్రపంచం అజ్ఞానపు చీకట్లలో ప్రయాణించినప్పుడు అది ఒక లాంతరు వలే చీకటిని చీల్చుతుందని అన్నారు.
ఇదీ చదవండి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు