లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన స్వచ్ఛంద సంస్థ పేదలకు కూరగాయల వితరణ చేపట్టారు. పాలు, గుడ్లను సైతం పంపిణీ చేశారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో కేంద్రం వద్ద బారులు తీరారు.
సామాజిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్న అనంతరమే పంపిణీ చేపట్టాలని నిర్వాహకులకు పోలీసులు స్పష్టం చేశారు.