వరంగల్ నగరంలో మాజీ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎనుమాముల వంద ఫీట్ల క్రాస్ రోడ్డు వద్ద భవన నిర్మాణ కార్మికులకు సురేఖ అభిమానులు పండ్లు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. తర్వాత ఎంజీఎం ఆసుపత్రిలో కొందరు కార్యకర్తలు రక్తదానం చేశారు.
అనంతరం కాశిబగ్గ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను అందజేశారు. స్థానిక హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో కొండా సురేఖ దంపతుల పేర్లమీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిద్దరూ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్