ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు రావటం వల్ల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేనప్పటికీ ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల హోటల్ నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా