కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పే వరకు పోరాటం ఆపేది లేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ తేల్చి చెప్పారు. వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం మొండి చేయి చూపడం పట్ల వరంగల్ నగరంలో ఎమ్మెల్యే నరేందర్, ఎంపీ దయాకర్ ధర్నా చేపట్టారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ కేంద్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ యువతను కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. యువత పట్ల కేంద్రం ఆన్యాయంగా వ్యవహరించిందన్నారు. ఒప్పందంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీని సాధించే వరకు ఒదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని యువత ఎంతో ఆశ కొద్ది ఎదురు చూసిందని... కాని వారి ఆశయాలను కేంద్రం అడియాశలు చేసిందని తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్