వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు... నాన్బోర్డర్స్ మధ్య ఘర్షణ చెలరేగింది. వర్సిటీలోని స్పోర్ట్స్ విభాగంలో ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. క్రీడా విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ షూ పంపిణీ విషయంలో వివాదం చెలరేగింది.
దుస్తుల పంపిణీ విషయంలో స్పోర్ట్స్ డైరెక్టర్ అవకతవకలకు పాల్పడుతున్నారని విద్యార్థులు నిలదీశారు. పక్కనే ఉన్న నాన్ బోర్డర్స్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధిత విద్యార్థులు కాకతీయ వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుస్తుల విషయంలో ప్రశ్నించినందుకే డైరెక్టర్ నాన్ బోర్డర్స్‌ను పిలిపించి కొట్టించారని బాధితులు ఆరోపించారు.
ఇవీ చూడండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్