ETV Bharat / state

పాసుపుస్తకాల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతన్నలు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన నిర్వహించారు. వరంగల్ అర్బన్​ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Farmers on water tank to give passbooks our lands in warangal urban dist
పాసుపుస్తకాల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు
author img

By

Published : Nov 10, 2020, 5:54 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో రైతన్నలు వాటర్ ట్యాంక్ పైకి నిరసన తెలియజేశారు. తమ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 40 మంది రైతులు మిషన్​ భగీరథ వాటర్ ట్యాంక్ పైకి ఆందోళన నిర్వహించారు.

​ జిల్లా ఆర్డీవో వాసుచంద్ర సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. గ్రామంలోని సర్వేనంబర్ 610 నుంచి 637 వరకు వివాదాస్పదమైన భూములు ఉండడంతో రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు మంజూరు చేయడం లేదు. అధికారులు స్పందించి తమకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.