ETV Bharat / state

'బస్సు నడుపుతుండగా డ్రైవర్​కి ఫిట్స్​ వచ్చింది'

author img

By

Published : Aug 21, 2019, 7:52 PM IST

పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్న స్కూల్ బస్ డ్రైవర్​కి ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది.

'బస్సు నడుపుతుండగా డ్రైవర్​కి ఫిట్స్​ వచ్చింది'

వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ ప్రకాశ్ పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలను బస్సులో ఇంటివద్ద దింపి రావడానికి బయలుదేరాడు. మడికొండ ప్రధాన రహదారి వద్ద బస్సుని మలుపు తిప్పే సమయంలో డ్రైవర్​కి ఫిట్స్ వచ్చింది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టి ఓ దుకాణం ప్రహరీ గోడ వద్ద ఆగిపోయింది. ప్రహరీ గోడకు విద్యుత్ స్తంభం ఆనుకుని ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పాఠశాల యాజమాన్యం బస్సు డ్రైవర్​ని ఆసుపత్రికి తరలించి... మరో డ్రైవర్ సాయంతో పిల్లలను అదే బస్సులో వారి ఇళ్లకు పంపించారు.

'బస్సు నడుపుతుండగా డ్రైవర్​కి ఫిట్స్​ వచ్చింది'

ఇవీ చూడండి: ప్రభుత్వ అందించిన సాయం గొప్పది: అమెజాన్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్​

Intro:TG_WGL_12_21_ADHUPU_THAPPINA_SCHOOL_BUS_PILLALU_BADRAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) పాఠశాల నుండి పిల్లలను ఇంటికి తీసుకు వెళుతున్న స్కూల్ బస్ డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ ఆటో దెబ్బతినగా .... పాఠశాల పిల్లలు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ కొంత అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం అతడిని వెంటనే స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. కాజీపేటలోని అక్షర ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ ప్రకాష్ పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలను బస్సులో ఇంటివద్ద దింపి రావడానికి బయలుదేరాడు. ఈ క్రమంలో మడికొండ ప్రధాన రహదారి వద్ద బస్సు ని మలుపు తిప్పే క్రమంలో డ్రైవర్ కి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీనితో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటో తో పాటుగా .... పక్కన ఉన్న దుకాణం ప్రహరీ గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రహరీ గోడకు ఆనుకొని విద్యుత్ స్తంభం ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. స్థానికులు వెంటనే స్పందించి పాఠశాల బస్సు ని అక్కడ నుంచి బయటకు తీశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పాఠశాల యాజమాన్యం బస్సు డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించి.... మరో డ్రైవర్ సహాయంతో పిల్లలను అదే బస్సులో వారి గ్రామాలకు పంపించారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.